ఐపిఎల్‌లో ఎవరెవరికి ఏ అవార్డులు..

IPL 2019 cup
IPL 2019 cup

హైదరాబాద్‌: ఐపిఎల్‌-12 సీజన్‌లో 8 జట్ల మధ్య పోరు హోరాహరీగా సాగింది. 59 మ్యాచ్‌ల ఐపిఎల్‌ సీజన్‌కు తెరపడింది. ఈ ఐపిఎల్‌లో ప్రతిభ చాటిన వారు ఏ అవార్డులు అందుకున్నారో కింద ఇవ్వబడినవి.

rohit sharma
rohit sharma


విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ప్రైజ్‌ మనీగా రూ. 20 కోట్లు గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆ జట్టు సారథి రోహిత్‌శర్మ మాట్లాడుతూ..ఫైనల్‌లో మలింగదే అత్యుత్తమ ప్రదర్శన, సీజన్‌ మొత్తం మంచి క్రికెట్‌ ఆడాం, కష్టానికి తగిన ఫలితం దక్కిందని అన్నాడు.

dhoni
dhoni


ఈ ఫైనల్‌లో రన్నర్‌గా నిలిచిన జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌కి రూ. 12.50 కోట్లు ప్రైజ్‌ మనీ లభించింది. ఈ సందర్బంగా ఆ జట్టు సారథి ధోని మాట్లాడుతూ..మా జట్టులో మిడిలార్డర్‌ సమస్య ఉందని, లోపాలను సవరించుకుని మళ్లీ మీ ముందుకు వస్తామని, ఈ సీజన్‌ తమకు గొప్ప అనుభూతిని మిగిల్చిందని అన్నాడు.

IPL-2019 awards winners
IPL-2019 awards winners


ఫెయిర్‌ ప్లే అవార్డు: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌
పర్పుల్‌ క్యాప్‌(అత్యధిక వికెట్లు): ఇమ్రాన్‌ తాహీర్‌( సిఎస్‌కె) రూ. 10 లక్షలు
ఆరెంజ్‌ క్యాప్‌(అత్యధిక పరుగులు): డేవిడ్‌ వార్నర్‌( ఎస్‌ఆర్‌హెచ్‌), రూ. 10 లక్షలు
అత్యధిక విలువైన ఆటగాడు: ఆండ్రి రసెల్‌( కెకెఆర్‌), హారియర్‌ కారుతో పాటు చెక్కు
సూపర్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది సీజన్‌: ఆండ్రి రసెల్‌ (కెకెఆర్‌), రూ. 10 లక్షలు
గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ది సీజన్‌: రాహుల్‌ చాహర్‌, రూ.10 లక్షలు
స్టైలిష్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌: కేఎల్‌ రాహుల్‌, రూ.10 లక్షలు
అత్యంత వేగవంతమైన అర్ధశతకం, రూ. 10 లక్షలు
ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌: శుభమన్‌గిల్‌, రూ. 10 లక్షలు
పర్‌ఫెక్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ది సీజన్‌: కీరన్‌ పొలార్డ్‌, రూ. 10 లక్షలు
ఉత్తమ పిచ్‌, మైదానం: హైదరాబాద్‌, మొహాలీ(పంజాబ్‌)

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/