కమెండేషన్‌ డిస్క్‌ అవార్డుల ప్రదానం

ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు డీజీపీ మెడల్స్‌ అందజేత

AP DGP Gautam Sawang
AP DGP Gautam Sawang

Amaravati: కమెండేషన్‌ డిస్క్‌ అవార్డులను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రదానం చేసారు కరోనా, ప్రకృతి వైపరీత్యాల్లో మెరుగైన సేవలందించిన సిబ్బందికి డీజీపీ కమెండేషన్‌ డిస్క్‌ అవార్డులిచ్చారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు డీజీపీ డిస్క్‌ మెడల్స్‌ ఇచ్చారు.

40 మందికి ప్రతిభా పురస్కారాలను డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ అందించారు. ఏపీ సెక్యూరిటీ వింగ్‌ దేశానికే ప్రామాణికమన్నారు. ఏపీ పోలీస్‌ దేశంలోనే అత్యుత్తమ పోలీస్‌ ఫోర్స్‌గా గుర్తించబడిందన్నారు.

అంతేకాకుండా లోన్‌ యాప్‌లపై ఏపీ డీజీపీ చిట్‌చాట్ నిర్వహించారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ప్రత్యేక‌ దృష్టి పెడతామన్నారు. లోన్‌ యాప్‌లు మహిళల్నే ఎక్కువగా టార్గెట్‌ చేస్తున్నాయని తెలిపారు. లోన్ యాప్‌లపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని తెలిపారు.

బాధితులు ధైర్యంగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎక్కువగా నోయిడా, ఢిల్లీ, గుర్గావ్‌ నుంచి యాప్‌లు నిర్వహిస్తున్నారని సవాంగ్‌ పేర్కొన్నారు. 

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/