అవతార్ హీరోయిన్ ఆ ఒక్క సీన్ కోసం 7 నిమిషాలు ఊపిరి తీసుకోకుండా ఉందట

యావత్ సినీ లవర్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న అవతార్ 2 మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ మరో లోకానికి తీసుకెళ్లారని చెపుతున్నారు. కాగా ఈ చిత్ర హీరోయిన్ ప్రమోషన్ లలో పలు ఆసక్తికర విషయాలను తెలిపి ఆశ్చర్యపరిచింది. సినిమాలోని ఓ సిన్ కోసం ఆమె 7 నిమిషాల పాటు ఊపిరి తీసుకోలేదట.

ప్రమోషన్స్లో భాగంగా హాలీవుడ్ నటి కేట్ విన్స్ లేట్ ఈ సినిమా చిత్రీకరణలో జరిగిన ఓ విషయాన్ని తెలిపి అందరిని షాక్కు గురి చేసింది దర్శకుడు జేమ్స్ కామరూన్ ప్రతి సీను ఎంతో పర్ఫెక్ట్ గా వచ్చే విధంగా చిత్రీకరిస్తాడు అందుకు ఎలాంటి సాహసం నైనా వెనకాడకుండా చేయాలని నటీనటులకు ప్రోత్సాహం ఇస్తాడు.. అయితే ఈ క్రమంలోనే హీరోయిన్ కేట్ ఓ సీన్ కోసం నీటి అడుగున ఏకంగా ఏడు నిమిషాల పాటు ఉండవలసి వచ్చింది అంట అయితే ఈ సమయంలో తాను ఊపిరి పీల్చుకోవటం కూడా అవ్వలేదని తెలిపింది..

“షూటింగ్ నీటికి అడుగు భాగంలో చేయవలసి వచ్చింది.. ఈ సమయంలో ఎంతో ఒత్తిడికి గురయ్యా.. అలాగే ఒకానొక సమయంలో చనిపోతున్నానేమో అంటూ కూడా భయం వేసి గట్టిగా అరిచాను.. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నా దగ్గర ఉంది దాదాపు 7 నిమిషాల పాటు ఊపిరి పీల్చుకోకుండా నీటిలో ఉండిపోయా.. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోయా..” అంటూ తెలిపింది.