ఏపీ నంబర్‌ వన్‌ కాబోతోంది

Avanti Srinivas, MLA
Avanti Srinivas, MLA

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైయస్‌ జగన్‌ సారధ్యంలో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉంటుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈ రోజు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందన్నారు. 42 ఏళ్ల వయసు వ్యక్తి పార్టీ పెట్టి ఈ స్థాయిలో ఘన విజయం సాధించడం చరిత్రలో ఇదే మొదటి సారి అన్నారు. పేదల దేవుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి అని, ఆయన పాలన మళ్లీ వైయస్‌ జగన్‌ తీసుకురాబోతున్నారు. ప్రతి పేదవాడు సంతోషంగా ఉండేలా పరిపాలన సాగబోతుందన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌ సునామి సృష్టించిందన్నారు. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.