పవన్‌కు వాళ్లతో కలవాల్సిన అవసరం ఏంటి?

avanthi srinivas
avanthi srinivas

విశాఖ: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు టిడిపి నేతలైన అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడుతో కలవాల్సిన అవసరం ఏముందని వైఎస్‌ఆర్‌సిపి నేత అవంతి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. వాళ్ళు లేకుండా విశాఖలో పవన్‌ సభ పెట్టలేరా అని విమర్శించారు. విజయసాయి రెడ్డిని విమర్శించడానికి పవన్‌కు ఏం అర్హత ఉందన్నారు. విజయసాయి రెడ్డిలా రాజ్యసభో ఎవరూ మాట్లాడలేరని, పవన్‌ సినిమాల్లో సంపాదించిన సొమ్మును భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని సూచించారు. పవన్‌లాగా అసభ్యంగా ఎవ్వరూ మాట్లాడరని అవంతి విమర్శించారు. జగన్‌పై పెట్టినవి తప్పుడు కేసులని ప్రజలే తీర్పునిచ్చారన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెట్టడం సాధారణమని అవంతి శ్రీనివాస్‌ అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/