అందుబాటులోకి 1,000 కరోనా టెస్టింగ్ కిట్స్
వారం రోజుల్లో 10,000 టెస్టింగ్ కిట్స్

అమరావతి: రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా అనుమానితులు సైతం అధికంగా ఉండడం,వారిని పరీక్షీంచడానికి కావలసినన్ని టెస్టింగ్ కిట్స్ అందుబాటులో లేకపోవడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం టెస్టింగ్ కిట్స్ సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. ఇందుకు అనుగూనంగా కరోనా పరీక్షల కోసం 1,000 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌ను అందబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఒక్కోకిట్తో రోజుకు 20 టెస్టులు నిర్వహించవచ్చు. 50 నిమిషాల్లోనే టెస్టింగ్ రిపోర్ట్ వస్తుంది అని, మరో వారం రోజుల్లో 10,000 టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/