పన్ను తగ్గింపుతో డిమాండ్‌ పెంచండి!

automobiles
automobiles


న్యూఢిలీ: ఆటోమొబైల్‌రంగంలో నెలకొన్న మాంద్యం పోవాలంటే ఇపుడున్న పన్ను రాయితీలు ఎంతమాత్రం సరిపోవన్న భావన వ్యక్తం అవుతున్నది. వాహనాల ధరలు కొంతమేర తగ్గుతాయన్న సమాచారం వాస్తవమే అయినా డిమాండ్‌ లేదని అందువల్ల మార్కెట్‌ పునరుద్ధరణ జాప్యం అవుతుందని నిపుణులు చెపుతున్నారు. ఆటో సంస్థలు మేకిన్‌ ఇండియా కార్యాచరణ కింద 15శాతం కంటే తక్కువకే జిఎస్‌టి ఉంటే కొంతమేర లాభం కలుగుతుందంటున్నారు. ఐదుశాతం జిఎస్‌టి అమలుచేయాలని లగ్జరీకార్లుకాకుండా ఇతర కేటగిరీ కార్లపై జిఎస్‌టి తగ్గించాలన్న డిమాండ్‌ ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. 23శాతం అమ్మకాల్లో పతనం చవిచూసిన ఆటోమొబైల్‌రంగం ప్రముఖ కంపెనీలు హుండై మోటార్స్‌, మారుతిసుజుకి, మహీంద్ర వంటి కంపెనీలు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసాయి. ఉన్న నిల్వలు క్లియర్‌చేసుకోవాలంటే ఇదే ఏకైకమార్గమని ఎంచుకున్న కంపెనీలు తాత్కాలిక మూసివేతతో ఉన్న నిల్వలు డీలర్లకు తరలివెళతాయన్న భావన వ్యక్తంచేస్తున్నారు. ఇపుడు ప్రకటించిన కార్పొరేట్‌ పన్నుల తగ్గింపుతో వచ్చిన ప్రయోజనాలు క్షేత్రస్థాయికి మళ్లించవచ్చన్న భావన వ్యక్తం అవుతోంది. ఇక ఆటోమొబైల్‌రంగంలో దీపావళి, నవరాత్రి పండుగల సందర్భంగా అమ్మకాల్లోపెరుగుదల నమోదవుతుంది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/