షెడ్యూల్‌ ప్రకారమే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

కార్చిచ్చు పొగతో ఎలాంటి ఇబ్బంది లేదన్న నిర్వాహకులు

Australian Open 2020
Australian Open 2020

మెల్‌బోర్న్‌: షెడ్యూల్ ప్రకారమే ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ జరుగనుంది. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 2 వరకు మెల్‌బోర్న్‌ పార్క్‌లో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ జరగనుంది. ఈ మేరకు టోర్నీ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆ్రస్టేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కార్చిచ్చు సెగ టోర్నీకి తగులుతుందనే వార్తల్ని నిర్వాహకులు కొట్టిపారేశారు. ఆస్ట్రేలియాను అతలాకుతలం చేస్తున్న కార్చిచ్చు మెల్‌బోర్న్‌ పార్క్‌కు ఎన్నో వందల కిలోమీటర్ల దూరంలో రగులుతోంది. కార్చిచ్చు వల్ల టోర్నీ వేదికకు, ఆటగాళ్లకు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగదని టెన్నిస్‌ ఆ్రస్టేలియా చీఫ్‌ క్రెయిగ్‌ టైలీ ఓ ప్రకటనలో తెలిపారు. ఏటీపీ ప్లేయర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడైన నొవాక్‌ జొకోవిచ్‌ మీడియాతో మాట్లాడుతూ… కార్చిచ్చు పొగవల్ల సమస్య ఉంటే మ్యాచ్‌ల్ని ఆలస్యంగా ప్రారంభించే అవకాశాల్ని పరిశీలించాలని సూచించారు. దీనిపై స్పందించిన క్రెయిగ్‌ వాతావరణ శాఖ నిపుణులు గాలి నాణ్యతపై ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తున్నారని, వారితో నిర్వాహక కమిటీ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియాలోని అడవులలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ ద్వారా వచ్చే డబ్బును బాధితులకు డొనేట్‌ చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/