ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు భారత్‌ బాల్‌ బాయ్స్‌

మొత్తం 10 మంది, హైదరాబాద్‌ నుంచి ఇద్దరు

Indian ball boys
Indian ball boys

మెల్‌బోర్న్‌: తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో భారత్‌ కు చెందిన మొత్తం పది మంది వర్ధమాన క్రీడాకారులు బాల్‌ బాయ్స్‌గా ఎంపికయ్యారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఉన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ వేదికగా జనవరి 20నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే ఈ టోర్నీలో వీరందరూ బాల్‌ కిడ్స్‌గా వ్యవహరిస్తారు. కియా మోటార్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బాల్‌ కిడ్స్‌ ఇండియా ప్రోగ్రామ్‌ ద్వారా భారత్‌లోని 10 మంది వర్ధమాన క్రీడాకారులకు అవకాశాన్ని కల్పించింది. మెరుగైన ప్రతిభ కనబర్చిన బాల్‌ బాయ్స్‌గా ఎంపికైన పది మంది పేర్లను ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్స్‌కు ఎంపికైన వారు హైదరాబాద్‌ నుంచి ఆదిత్య బిఎంవీ, సంస్కతి, అథర్వ హితేంద్ర(అహ్మదాబాద్‌), అత్రిజో సేన్‌ గుప్తా(కోల్‌కతా), దివ్యాన్షు పాండే, హర్షిత్‌ పండిత(గుర్‌గ్రామ్‌), రిజుల్‌ భాటియా(పంచకుల), శారివన్‌ కౌస్తుభ్‌(ముంబయి), యశ్‌వర్ధన్‌ గౌర్‌, సర్గమ్‌ సింగ్లా(చండీగఢ్‌).

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/