ఆసీస్‌తో హోరాహోరీ.!

ASISS
Australia

ఆసీస్‌తో హోరాహోరీ.!

భువనేశ్వర్‌ : హాకీ వరల్డ్‌కప్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అగ్రశ్రేణి జట్లు ఆశించిన స్థాయిలోరాణించలేదు. హ్యాట్రిక్‌ టైటిల్‌పై కన్నేసిన ఆస్ట్రేలియా పూల్‌-బిలోని తన తొలి మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాట్‌ పేవరెట్‌గా బరిలోకి దిగిన ఆసీస్‌ 2-1తో అతికష్టమ్మీద నెగ్గింది. ప్రపంచ 10వ ర్యాంకర్‌ ఐర్లాండ్‌ తొలి అర్ధభాగం దూకుడుగా ఆడి ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌కు ఐదు పెనాల్టీ కార్నర్లు లభించగా, అందులో నాలుగింటిని వృథా చేసుకొంది. ఆసీస్‌ తరపున బ్లేక్‌ కార్నర్‌ (11వ నిమిషం), టిమ బ్రాండ్‌ (34వ) గోల్స్‌ సాధించగా, ఐర్లాండ్‌ జట్టులో షేన్‌ డోంగ్యూ (13వ) గోల్‌ కొట్టాడు. ఇంగ్లండ్‌కు షాక్‌ : తొలి వరల్డ్‌కప్‌ ఆడుతున్న చైనా ప్రపంచ ఏడో ర్యాంకర్‌ జట్టు ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. 2-2 స్కోరుతో డ్రాగా ముగిసిన ఈ మ్యాచ ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంతో మరో నిమిషంలో మ్యాచ్‌ను ముగుస్తుందనగా చైనాకు పెనాల్టీ కార్నర్‌ లభించింది. దీన్ని చైనీస్‌ ఆటగాడు డుటాలేక్‌ గోల్‌గా మలచడంతో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి.