ఆస్ట్రేలియాలో మహిళల టి20 వరల్డ్ కప్ ఆరంభం

తొలి మ్యాచ్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా

India vs Australia ICC Women's T2
India vs Australia ICC Women’s T2

సిడ్నీ: నేటి నుండి ఆస్ట్రేలియా వేదికగా మహిళల టి20 కప్ జరగనుంది. ఆరంభ మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా టాస్ గెలిచి టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఈ మ్యాచ్ సిడ్నీలో జరుగుతోంది. అయితే, మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ అదిరిపోయే ఆరంభం దక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి వికెట్ కు షెఫాలీ వర్మ (15 బంతుల్లో 29 రన్స్), స్మృతి మంధన (10) ఓవర్ కు పది రన్ రేట్ తో 41 పరుగులు జోడించారు. కానీ 6 పరుగుల తేడాతో భారత్ 3 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (2) తీవ్రంగా నిరాశపర్చింది. ఎలిస్ పెర్రీ ఒక వికెట్, జొనాసెన్ 2 వికెట్ల తీసి భారత్ ను దెబ్బకొట్టారు. ప్రస్తుతం భారత్ స్కోరు 8 ఓవర్లలో 3 వికెట్లకు 51 పరుగులు కాగా, క్రీజులో జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఆడుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/