ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ఎందుకు డిక్లేర్‌ చేసిందంటే?

david warner
david warner

అడిలైడ్‌: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ వార్నర్‌ అజేయంగా 335 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 589 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలోనే ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ డిక్లేర్‌ చేశాడు. టెస్టు క్రికెట్‌లో వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రియాన్‌ లారా నెలకొల్పిన 400 పరుగుల అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును వార్నర్‌ సాధించే అవకాశం వున్న పైన్‌ నిర్ణయంతో అది చేజారిపోయిందని సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది. దాంతో టిమ్‌పైన్‌ తీసుకున్న నిర్ణయానికి గల కారణాన్ని వార్నర్‌ వివరించాడు. మేం ఆదివారం మూడో రోజు వాతావరణాన్ని పరిశీలించాం. మా జట్టు బౌలింగ్‌ చేయడానికి ఎక్కువ సమయం కావాలనుకున్నాం. అయితే ఈ రోజే ఆరు వికెట్లు తీయగలిగాం. ఒక వేళ రేపు వర్ష´ం పడే అవకాశం ఉంటే ..మా బౌలర్లకు తగిన విశ్రాంతి లభిస్తుంది. అప్పుడిక రెండు రోజుల్లో 14 వికెట్లు పడగొడితే సరిపోతుందని వార్నర్‌ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్‌ కెప్టెన్‌ నిర్ణయం సరైందని తెలిపాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/