ఆసీస్‌ స్కోరు 86/5

steve smith
steve smith

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా విండీస్‌తో జరగుతున్న మ్యాచ్‌లో ఆసీస్‌ కష్టాల్లో పడింది. విండీస్‌ బౌలింగ్‌ ధాటికి విలవిలల్లాడుతుంది. టాస్‌ గెలిచిన విండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ ఆసీస్‌కు బ్యాటింగ్‌ అప్పగించాడు. 15 పరుగులకే ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌(6)ను ఒషాన్‌ థామస్‌ పెవిలియన్‌ పంపాడు. ఆ తర్వాత 11 పరుగులకే మరో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(3)ను కాట్రెల్‌ ఔట్‌ చేశాడు. ఉస్మాన్‌ ఖ్వాజా(13) రస్సెల్‌ బౌలింగ్‌లో షా§్‌ు హోప్‌ ఔట్‌ చేశాడు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కాట్రెల్‌ బౌలింగ్‌లో షా§్‌ుహోప్‌ కుక్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మార్కస్‌ స్టోయినెస్‌(19) హోల్డర్‌ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆసీస్‌ 22 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్టీవ్‌ స్మిత్‌(24), అలెక్స్‌ క్యారీ(3)లు ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/