ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు

కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్‌ విజృంభణ మొదలైంది. ఆస్ట్రేలియాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలి మరణం నమోదైంది. కరోనా వేరియంట్‌తోపాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 80 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ వృద్ధుడికి ఇటీవల ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిందని.. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశాడని ఆస్ట్రేలియా వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ వ్యక్తికి వృద్ధుల సంరక్షణా కేంద్రంలో ఈ వైరస్‌ సోకినట్లు అధికారులు తెలిపారు. అయితే.. పూర్తి వివరాలను వెల్లడించిందుకు అస్ట్రేలియా అధికారులు నిరాకరించారని మీడియా వెల్లడించారు.

కాగా.. ఆస్ట్రేలియాలో కరోనా విజృంభణతో ఇప్పటికే పలుమార్లు లాక్‌డౌన్లు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ఒక వ్యక్తి మృతి చెందడంతో మళ్లీ కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. దీంతోపాటు రోజువారీ కరోనా కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయని.. ఆంక్షలు విధించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. ఈ వృద్ధుడి మరణంపై ఎపిడమాలజిస్టు క్రిస్టియన్‌ సెల్వే మాట్లాడుతున్న వీడియోను ఆస్ట్రేలియా ప్రభుత్వం విడుదల చేసింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/