కోవీషీల్డ్‌కు ఆస్ట్రేలియా ఆమోదం

సిడ్నీ: ఆస్ట్రేలియా వైద్య నియంత్ర‌ణ మండలి కోవీషీల్డ్ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపింది. భార‌త్‌కు చెందిన సీరం సంస్థ .. కోవీషీల్డ్ కోవిడ్ టీకాల‌ను త‌యారు చేస్తున్న విష‌యం తెలిసిందే. కోవీషీల్డ్ టీకా తీసుకున్న భార‌తీయులు ఇక నుంచి ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించ‌వ‌చ్చు. ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వేలాది మంది ఇండియ‌న్ల‌కు ఊర‌టనిచ్చింది. కోవీషీల్డ్‌తో పాటు చైనాకు చెందిన సైనోవాక్ టీకాలు ఇస్తున్న ర‌క్ష‌ణ ప‌ట్ల ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ సంతృప్తి వ్య‌క్తం చేశారు.

మ‌రో వైపు అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌పై ఉన్న ఆంక్ష‌ల‌ను కూడా ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ఎత్తివేయ‌నున్న‌ది. న‌వంబ‌ర్ నుంచి విదేశీ ప్ర‌యాణికులు రావ‌చ్చు అంటూ ఇవాళ ఆ దేశం ప్ర‌క‌టించింది. అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌పై గ‌త 18 నెల‌లుగా ఉన్న నిషేధాన్ని ఆస్ట్రేలియా ఎత్తివేసింది. సైనోవాక్‌, కోవీషీల్డ్ టీకాలు వేసుకున్న అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌కు ఆటంకాలు ఉండ‌వ‌ని స్కాట్ తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/