ఆస్ట్రేలియా ప్రధానిపై గుడ్డు విసిరిన మహిళ

Australia PM Scott Morrison
Australia PM Scott Morrison

హైదరాబాద్‌: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ సాధారణ ఎన్నికల భాగంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కెనబెరా సమీపంలోని అల్బురీలో మహిళా సంఘం సమావేశంలో స్కాట్ మారిస‌న్ మ‌హిళ‌ల‌తో ముచ్చ‌ట‌పెడుతున్న స‌మ‌యంలో వెనక నుండి ఓ మహిళ ఆయన తలపై గుడ్డును విసిరింది. అయితే గుడ్డు పగలలేదు. ఈ ఘ‌ట‌న‌లో 25 ఏళ్ల మ‌హిళ‌ను పోలీసులు వెంట‌నే అదుపులోకి తీసుకున్నారు. ఓ పిరికి వ్య‌క్తి గుడ్డు విసిరిన‌ట్లు ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆస్ట్రేలియాలో ఇటీవ‌ల ప‌లువురు నేత‌ల‌పైన కూడా గుడ్ల దాడి జ‌రిగింది. మే 18వ తేదీన ఆస్ట్రేలియాలో జాతీయ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి.

మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/