ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 369 ఆలౌట్

భారత బౌలర్లలో నటరాజన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ మూడేసి వికెట్లు

Australia first innings 369 allout
Australia first innings 369 allout

Brisbane: భారత్ తో జరుగుతున్న చివరి నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

తొలి రోజు 274/5 స్కోరుతో ముగించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆ స్కోరుకు కేవలం 95 పరుగులు మాత్రం జోడించి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది.

భారత బౌలర్లలో నటరాజన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ లు మూడేసి వికెట్లు పడగొట్టగా, సిరాజ్ కు ఒక వికెట్ దక్కింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/