ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌

India-vs-Australia
India-vs-Australia

న్యూఢిల్లీ: ఆసీస్‌-భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో ఆసీస్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా సెంచరీ చేశాడు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి వీరిద్దరు కలిసి 76 పరుగులు జోడించారు. అయితే రవీంద్ర జడేజా వేసిన 15వ ఓవర్ మూడో బంతికి ఫించ్(27) క్లీన్ బౌల్డ్ అయ్యాడు .ఆ తర్వాత బ్యాటింగ్‌కి దిగిన హాండ్స్‌కోంబ్‌తో కలిసి ఖవాజా నిలకడగా రాణించాడు. భారత బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ తన వన్డే కెరీర్‌లో రెండో వన్డేని సాధించాడు. 102 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 100 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరోవైపు హ్యాండ్స్‌కోంబ్ కూడా 47 పరుగులతో అర్థశతకానికి చేరువలో ఉన్నాడు.తరువాత షమి బౌలింగ్‌లో హాండ్స్‌కోంమ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. జడెజా బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌ కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. ఆతరువాత ఫిల్డ్‌లోకి వచ్చిన టార్న్‌ర్‌ కుల్‌దిప్‌ బౌలింగ్‌లో జెడెజాకు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. జెడెజా 2వికెట్లు , షిమి, భూవనేశ్వర్‌, కుల్‌దిప్‌ యాదవ్‌, ఒక్కోక్క వికెట్‌ తీశారు. ప్రస్తుతం 44 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. క్రీజ్‌లో మార్కస్‌ (20), ఆలెక్స్‌ (3) ఉన్నారు.

మరిన్ని క్రీడ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/