వాటర్‌బాటిల్స్ అందించిన ఆసీస్ ప్రధాని…

కాన్బెర్రా: ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరిగిన టీ20 వార్మప్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తమ ఆటగాళ్ల కోసం వాటర్ బా§్ు అవతారమెత్తారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం లసిత్ మలింగ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఆదివారం అడిలైడ్ వేదికగా మొదలుకానున్న తొలి టీ20 మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కంగారూ (ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్)-లంక జట్లు వార్మప్ మ్యాచ్‌లో తలపడ్డాయి. కాన్‌బెర్రాలోని ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లంక ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో…ఆస్ట్రేలియా ప్రధాని స్పాట్ మారిసన్ ఒక్కసారిగా మైదానంలోకి పరుగెత్తుతూ వచ్చారరు. 16వ ఓవర్లో తమ క్రికెటర్ల కోసం వాటర్ బాటిల్స్ తీసుకువచ్చారు. ఊహించని ఈ పరిణామంతో ఆసీస్ ఆటగాళ్లు స్వీట్ షాక్‌కు గురయ్యారు. ఇక ప్రధాని రాకను చూసి కొంతమంది చిరునవ్వులు చిందించగా..మరికొంత మంది ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. కాగా తెలుపురంగు షర్టు, నల్లరంగు ప్యాంటు ధరించిన స్కాట్ మారిసన్…ఆసీస్ క్రికెట్ జట్టు క్యాప్‌ను ధరించి మైదానంలోకి రావడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తాజా చెలి వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/specials/women/