త్వరలో ఆసీస్‌ హిట్టర్‌ మాక్స్‌వెల్‌ పెళ్లి

భారత సంతతికి చెందిన అమ్మాయితో

Aussie hitter Maxwell is married soon
Aussie hitter Maxwell is married soon

మెల్‌బోర్న్‌: భారత సంతతికి చెందిన అమ్మాయితో గత కొంతకాలంగా చెట్టపట్టాలేసు కుని మెల్‌బోర్న్‌వీధుల్లో తిరుగుతున్న ఆసీస్‌ క్రికెటర్‌ మాక్స్‌వెల్‌ భారత సాంప్రదాయం ప్రకారం ఆమెతో తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు.

ఆసీస్‌ పవర్‌హిట్టర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ త్వరలోనే ఇంటివాడవుతు న్నాడు. భారతీయ సంతతికి చెందిన వినిరామన్‌తో తాజాగా ఆతడు నిశ్చితార్థంచేసుకున్నాడు.

మెల్‌బోర్న్‌లో ఫార్మాసిస్ట్‌గా పని చేస్తున్న వినిరామన్‌తో గత కొంతకాలంగాప్రేమాయణం నడుపుతున్న మాక్స్‌వెల్‌ ఇటీవల బిగ్‌ బాల్‌లీగ్‌ సమయంలో ఆ అంశం అందరికీ తెలిపాడు.

తాజాగా భారత సాంప్రదాయాల ప్రకారం మాక్స్‌వెల్‌తో తనకి నిశ్చితార్థం జరిగిందని వినిరామన్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించింది. మోఒచేతి గాయం కారణంగా గత కొద్దిరోజులుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న గ్లెన్‌మాక్స్‌వెల్‌ ఐపిఎల్‌ 2020 సీజన్‌లో ఆడేందుకు సిద్ధం అవుతూ కనిపించాడు.

కానీ కరోనా వైరస్‌కారణంగా ఈనెల 29న జరగాల్సిన ఐపిఎల్‌ 15కి వాయిదా పడ టంతో ఈగ్యాప్‌లో ప్రేమజంట నిశ్చితార్థం కార్యక్రమాన్ని పూర్తిచేసుకుంది. బిజి షెడ్యూలులో గత ఏడాది అక్టో బరులో మెంటల్‌ హెల్త్‌ ఇష్యూ అంటూ ఓ 2నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్న మాక్స్‌వెల్‌ ఆ తర్వాత బిగ్‌బాష్‌ లీగ్‌లో అదరగొట్టేశాడు.

అంతేకాకుండా గత ఏడాది చివరిలో జరిగిన ఐపిఎల్‌వేలంలో రూచరెండుకోట్ల ప్రాతమిక థరతో వేలంలోకి వచ్చిన మాక్స్‌వెల్‌కోసం ఆఖరివరకూ పోటీపడిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ఫ్రాంచైజీ ఏకంగా 10.75 కోట్లకి కొనుగోలుచేసింది.దీనితో ఐపిఎల్‌లో ఈ హిట్టర్‌ ఎలారాణిస్తాడో అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/