టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌, ఆస్ట్రేలియా

finch, virat
finch, virat

నాగ్‌పూర్‌: భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరగబోయే రెండో వన్డే మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ మొదటగా ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. టర్నర్‌, బెహ్న్రోడార్ఫ్‌ల స్థానంలో షాన్‌మార్ష్‌, నాథన్‌లైయన్‌లను జట్టులోకి తీసుకున్నట్లు ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ చెప్పాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వివరించాడు. ఈ మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన ఇచ్చి సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించాలని కోహ్లిసేన పట్టుదలగా ఉంది.
భారత జట్టు: రోహిత్‌ శర్మ, శిఖర్‌ధావన్‌, విరాట్‌ కోహ్లి, అంబటిరాయుడు, ధోని, కేదార్‌ జాదవ్‌, విజ§్‌ు శంకర్‌,జడేజా, కుల్దీప్‌ యాదవ్‌ ,షమీ, బుమ్రా
ఆస్ట్రేలియా జట్టు: ఉస్మాన్‌ ఖ్వాజా, అరోన్‌ ఫించ్‌, షాన్‌ మార్ష్‌, మార్కస్‌ స్టాయినీస్‌, హాండ్స్‌కాంబ్‌, మాక్స్‌వెల్‌, అరెక్స్‌కేరి, కౌల్టర్‌ నైల్‌, కమిన్స్‌, లైయన్‌, జంపా