ఆసీస్‌ చేతిలో శ్రీలంక పరాజయం

AUS vs SL, 2nd T20
AUS vs SL, 2nd T20

ఆస్ట్రేలియా: పది రోజుల క్రితం పాకిస్థాన్‌ని మూడు టీ20 సిరీస్‌లో వణికించిన శ్రీలంక ..ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు టీ 20ల్లోనూ ఓడిపోయింది. ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్‌లో శ్రీలంక తేలిపోయింది. గత ఆదివారం అదిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కంగారూల చేతిలో ఏకంగా 134 పరుగుల తేడాతో ఓడిన లంకేయులు బ్రిస్బేన్‌ వేదికగా బుధవారం జరిగిన రెండో టీ20లోనూ నిరాశపరిచారు. దీంతో మూడు టీ20ల సరిస్‌ని ఒక మ్యాచ్‌ ఉండగానే 2-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకోగా ఆఖరి టీ20 మ్యాచ్‌ మెల్‌బోర్న్‌లో శుక్రవారం జరగనుంది. బుధవారం రెండో టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక జట్టు పేలవంగా 19 ఓవర్లలోనే 117 పరుగులకి అలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టాన్‌లేక్‌, పాట్‌ కమిన్స్‌, అస్టన్‌ అస్గర్‌, ఆడమ్‌ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా …కుశాల్‌ మెండిస్‌, సందకన్‌ రనౌటయ్యారు. కెప్టెన్‌ లసిత్‌ మలింగ, హసనరంగ స్పిన్నర్‌ ఆడమ్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయ్యారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/