నాలుగో రోజు ఆస్ట్రేలియా 104/4

Aus. Batting
Aus. Batting

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ విజయానికి భారత్‌ మరో ఆరు వికెట్ల దూరంలో ఉంది. 324 విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. షాన్‌ మార్ష్‌ (31), ట్రవిస్‌ హెడ్‌ (11) క్రీజులో ఉన్నారు. భారత ఔలర్లు అశ్విన్‌, షమీ చెరో రెండు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా విజయానికి మరో 219 పరుగులు చేయాల్సి ఉంది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 250 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 235 పరుగులు చేసిన విషయం తెలిసిందే.