ఆకర్షించే యవ్వన తొలి అడుగులో..

Attractive youthful first step

చెడు అలవాటును పరిచయం చేయడంలో ఫ్రెండ్స్‌వాడే మాట ఒక్కసారికి ఏమైపోతుందిలే అని అక్కడ నుంచి వ్యసనం మొదలవుతుంది. అదే పతనానికి నాంది అని గ్రహించాలి. మత్తుపదార్థాలను తీసుకోవడం, అసభ్యకరవీడియోలను చూడడం జీవితాలను నాశనం చేస్తాయి. మంచి ఫ్రెండ్స్‌కి దగ్గరవ్వాలి. చెడుస్నేహాన్ని వీడాలి.

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం ద్వారా టీనేజ్‌లో ప్రమాదాల నుంచి బయటపడగలరు. కౌమారదశలో ఆడపిల్లలకు శారీరక మార్పులు, హోర్మోన్‌ల ప్రభావం ఉంటుంది. ఆ సమయంలో పిల్లల్ని వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టేవారిపై కఠినంగా ఉండాలి.

యవ్వనం పారే సెలయేరులాంటిది. అదెప్పుడూ స్వచ్ఛంగా ప్రవహిస్తుంది. మలినాన్ని తనలో ఏమాత్రం ఉంచుకోదు. అలాగే యువత కూడా తమలో దేన్నీ దాచుకోలేరు. మంచి అయినా చెడుఅయినా ప్రతిదీ స్నేహితులతో పంచుకోవాలనే కుతూహలం ఉంటుంది. కెరటాల్లా ఎగసిపడుతుంటారు. చిలిపిచేష్టలతో కే రింతలు కొడుతుంటారు. ఇంతవరకూ బాగానే ఉంటుంది. కానీ ఆ ఎంజా§్‌ులో ఏది చేయాలో ఏది చేయకూడదో గ్రహించే స్థితిలో ఉండరు. దీంతో జీవితం చేజారిపోతుంది. అంతేకాదు ప్రపంచం గురించి ఇప్పుడే తెలుసుకుంటారు. అనేక పరిచయాలు కొత్త ఆలోచనలు, ఆకర్షణలు, ఆలోచనలు తెలుస్తుంటాయి. పాలకు నీళ్లకు తేడా తెలుసుకోలేని వయసు, పాఠశాల విద్యను పూర్తిచేసి ఉన్నత విద్యకు శ్రీకారం చుట్టే ప్రధాన ఘట్టం ఇదే. తాము ఏర్పాటు చేసుకునే లక్ష్యాలకు పదును పెట్టాల్సిన సమయం ఇదే. పట్టుదలతో చదవాలన్నా, పరిచయాలతో చెడు అలవాట్లకు గురికావాలన్నా ఇక్కడే జరుగుతుంది. బాగుపడాలన్నా చెడిపోవాలన్నా టీనేజ్‌ కత్తిమీద సామని చెప్పాలి. ఉజ్వల భవిష్యత్‌కి భుజం తట్టి ప్రోత్సహించే చేతులుంటాయి.

చెడుమార్గాన్ని నడిపించే చేతులుంటాయి. జాగ్రత్తని ప్రముఖులు చెబుతున్నారు. కౌమార దశలో వచ్చే కొత్తకొత్త అనుభూతులు కొందరిని బలహీనులుగా మారుస్తాయి. హార్మోన్ల ప్రభావంతో లైంగిక ఆకర్షణలకు గురికావడం, ఆపై దాడులకు గురవడం, మోసపోవడం చూస్తుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో పరువానికి పగ్గాలు వేయడం ముఖ్యం. ముఖ్యంగా బాలికలు ఎదుర్కొనే పరిస్థితులు వేరు. తోటి విద్యార్థులుగాని, ఉపాధ్యాయులుగాని శుభాకాంక్షలు చెబుతూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చినప్పుడు అరచేతిని వేలితో రుద్దడం, ప్రోత్స హిస్తున్నట్టు భుజంపై చేయివేయడం, ప్రయాణంలో చేతులు తాకించడం వంటి పలు చర్యలను ఆడపిల్లలు ఎదుర్కొనే ఇబ్బందికర స్పర్శలుగా గుర్తించారు. పరుషపదాలతో మాట్లాడడం, ఏకవచనంతో సంబోధించి మానసికంగా వేధించడం వంటి చర్యలూ వారిని కుంగదీస్తుంటాయి.

ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి వివరాలను పోలీసులకు చేరవేస్తే శక్తి టీం మహిళా కానిస్టేబుళ్లు రంగంలోకి దిగుతారు. వారి భరతం పడతారు. కళాశాలకు బస్సులో ప్రయాణించేటప్పుడు ఇబ్బందికరంగా ఎవరైనా ప్రవర్తిస్తే ప్రయాణంలో ఉండగానే పోలీసులకు సమాచారం ఇస్తే బస్‌ ట్రాకింగ్‌ చేసి దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది బస్‌స్టాప్‌కు చేరుకొని చర్యలు తీసుకుంటారు.

పాఠశాల వదిలి కళాశాలలో అడుగుపెట్టగానే స్మార్ట్‌ఫోన్‌, నెట్‌ బ్యాలెన్స్‌కు ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువ య్యేకొద్ది యువతలో నైతికవిలువలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఎలా ఆత్మహత్య చేసుకోవాలి, దొంగతనాలు ఎలా చేయాలి? వంటివన్నీ యూట్యూబ్‌లలో చూసి, పాడైపోతున్నారు. బర్త్‌డే పార్టీలు,

వాలెంటైన్స్‌డే, యూత్‌డే, ఫ్రెడ్‌షిప్‌డే లంటూ పార్టీ కల్చర్‌ ఎక్కువవుతుంది. గ్రూపుగా యువతీయువ కులు చేరి ఎంజా§్‌ు చేయాలనే ఆలోచన వస్తుంది. ఆ వేడుకలు రానురాను కాస్త అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి. లంచ్‌, డిన్నర్‌, డ్రింక్‌, బీర్‌ల వరకూ దారితీస్తుంది. మదర్స్‌డే, ఫాదర్స్‌డే లను కూడా తమ ఆనందాల కోసమే వాడుకుంటున్నారు. తరచూ పాస్ట్‌ఫుడ్‌కి అలవాటుపడి ఖర్చుని అమాంతంగా పెంచేస్తున్నారు. ఐదుగురు హోటల్‌కి వెళ్తే 2వేలుకి మించి ఖర్చు చేస్తారు.

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కి వెళ్లే వందలకొద్దీ ఖర్చు చేస్తారు. తల్లిదండ్రులు స్కూల్‌ ఫీజు చెల్లించడానికి ఇబ్బందిపడే పరిస్థితులో పిల్లలు ఖర్చులు భారంగా మారుతుంది. తల్లిదండ్రులు జేబు ఖర్చులకు దండిగా డబ్బులు ఇవ్వకపోతే పోపుల డబ్బాలో చేయిపెట్టక తప్పడం లేదు. అక్కడ చిల్లర దొరకకపోతే చిల్లర దొంగతనాలకు పాల్పడే స్థాయికి సిద్ధపడుతున్నారు. బాలనేరస్తుల్లో ఎక్కువమంది తమ వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడం కోసమే నేరాలకు పాల్పడుతున్నారు. డబ్బు అవసరాలను తగ్గించుకోవడం మంచిది. కాలేజీకి వెళ్తున్నామంటే కొందరు క్యారేజీని పక్కనపెట్టేస్తారు.

మధ్యాహ్నం భోజనం చేయకపోవడం, చిరుతిండితో సరిపెట్టడంతో ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. సమృద్ధిగా నీరుతాగారు. తాగమని చెప్పేవారుండరు. చెప్పినా వినిపించుకోరు. జంక్‌పుడ్‌ తినడంతో తరచూ అనారోగ్యానికి గురవుతారు. బాలికలు జీరోసైజ్‌ కోసం తిండిని పక్కనపెట్టేస్తున్నారు. చాక్లెట్లు డ్రింక్‌లతో సరిపెడుతున్నారు.

అప్పటివరకూ పుస్తకాల బ్యాగ్‌తో పటు భోజనం క్యారియర్‌ని ప్రత్యేకబ్యాగులో తీసుకెళ్తారు. ఎల్‌కేజి నుంచి పదోతరగతి వరకూ అదే అలవాటుగా కొనసాగుతుంది. కాలేజీకి రాగానే ఇంటి భోజనంపై శ్రద్ధ తగ్గుతుంది. ఎదిగే వయసులో సమృద్ధిగా పౌష్టికాహారం తినాలి. కానీ జంక్‌ఫుడ్‌కు అలవాటు పడతారు. అందుకే క్రమశిక్షణగా ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లారు. చెడు అలవాటును పరిచయం చేయడంలో ఫ్రెండ్స్‌వాడే మాట ఒక్కసారికి ఏమైపోతుందిలే అని అక్కడ నుంచి వ్యసనం మొదలవుతుంది. అదే పతనానికి నాంది అని గ్రహించాలి.

మత్తుపదార్థాలను తీసుకోవడం, అసభ్యకరవీడియోలను చూడడం జీవితాలను నాశనం చేస్తాయి. మంచి ఫ్రెండ్స్‌కి దగ్గరవ్వాలి. చెడుస్నేహాన్ని వీడాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం ద్వారా టీనేజ్‌లో ప్రమాదాల నుంచి బయటపడగలరు. కౌమారదశలో ఆడపిల్లలకు శారీరక మార్పులు, హోర్మోన్‌ల ప్రభావం ఉంటుంది. ఆ సమయంలో పిల్లల్ని వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టేవారిపై కఠినంగా ఉండాలి.

వారి ఏకాగ్రతను దెబ్బతీస్తున్నారు. అభం శుభం తెలియదు. ఏవో అనుభూతులతో కొందరు ఆకర్షణలో పడిపోతారు. భవిష్యత్‌ని నాశనం చేసుకుంటున్నారు. మగ స్నేహితుల మాటలకు ఆకర్షితులై చనువు పెంచుకుంటున్నారు. అవే శారీరక దాడులకు దారితీస్తున్నాయి. టీనేజ్‌ పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ప్రేమగా ఉండి ప్రతి అంశాన్ని అడిగి తెలుసుకోవాలి. క్రమశిక్షణతో ఉంటేనే పిల్లల ఉన్నత చదువులు సాధ్యమవుతాయి.

ఆడపిల్లలకు అణువణువునా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. ఇంటర్‌, పాలిటెక్నిక్‌కి వెళ్లే పిల్లలకు అంతా కొత్త వాతావరణం దీంతో తప్పట డుగులు పడే అవకాశం ఎక్కువ. సోషల్‌మీడియా ప్రభావంతో ప్రతి చిన్న విషయానికి పార్టీ చేసుకోవడం లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్లడం ఇటీవల ఎక్కువయ్యాయి. అవి బాలికలపై దాడులు జరగడానికి అవకాశంగా మారుతుంది. ఆడపిల్లలు ధైర్యంగా సమస్యలను ఎదురొడ్డి నిలబడేలా వారిని తీర్చిదిద్దాలి.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/