కొడాలి నాని ఇంటి ముట్టడికి టీడీపీ మహిళా కార్యకర్తల యత్నం..

AP Minister Kodali Nani
Kodali Nani

వైస్సార్సీపీ మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ మహిళా కార్యకర్తలు యత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. గత కొద్దీ నెలలుగా రాష్ట్రంలో వైస్సార్సీపీ – టీడీపీ పార్టీల మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మహిళలపై కొడాలినాని నోరు పారేసుకున్నాడని, బేషరతుగా ఆయన క్షమాపణలు చెప్పాలని టీడీపీ మహిళా నాయకులు డిమాండ్‌ చేస్తూ.. కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిని నేతను పోలీసులు వెనకేసుకు వస్తున్నారంటూ మహిళలు ఆందోళనకు దిగారు. కొడాలి నాని, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించే వద్దని పోలీసులు ఎంతగా చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొడాలి నాని ఆదేశాలతోనే తమను వేధిస్తున్నారంటూ మహిళలు ఆరోపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆందోళన చేపడుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ మహిళా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.