సీనియర్ నటుడు నరేష్ ఇంటి ఫై దాడి…భార్య ఫై అనుమానం

సీనియర్ నటుడు నరేష్ ఇంటిపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక తన భార్య రమ్య రఘుపతి ఉన్నారని నరేష్ ఆరోపిస్తున్నారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై దుండగులు దాడికి పాల్పడ్డారని నరేశ్ ఆరోపించారు. గత రాత్రి కారును ధ్వంసం చేశారని తెలిపారు. తన భార్య రమ్య రఘుపతి ఈ దాడి వెనుక ఉన్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నరేశ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, సీసీటీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తున్నారు. గత కొంతకాలం నుంచి రమ్య రఘుపతితో నరేష్‌కు విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అంతకుముందు సైతం ఇద్దరూ బహిరంగంగా ఘర్షణకు దిగిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో నరేష్ ఇంటిపై దాడి జరగడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం నరేష్..పవిత్ర తో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్నీ రీసెంట్ గా అధికారికంగా నరేష్ ప్రకటించడం జరిగింది.