బ్యాంక్ ఖాతాదారులకు షాక్ ?

ఏటీఎం విత్‌డ్రా చార్జీల పెంపు

atm services
atm services

ముంబయి: ఇకనుండి ఏటీఎం చార్జీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవడం, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటివి మరింత భారం కావొచ్చు. దీంతో బ్యాంక్ కస్టమర్లపై నేరుగానే ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఏటీఎం ఆపరేటర్ల అసోసియేషన్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు లేఖ రాసింది. క్యాష్ విత్‌డ్రాయెల్స్‌పై కస్టమర్లు చెల్లించే ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచాలని ఆపరేట్లు కేంద్ర బ్యాంక్‌ను కోరారు. లేదంటే వ్యాపారాలు దెబ్బతింటాయని తెలిపారు. రిజర్వు బ్యాంక్ ఇటీవలనే ఏటీఎంల సెక్యూరిటీ, మెయింటెనెన్స్ నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. కొత్త ప్రమాణాలను కూడా తీసుకువచ్చింది. దీంతో ఆపరేటర్లకు ఏటీఎం నిర్వహణ భారమైంది. దీంతో ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచాలని ఆపరేటర్లకు లేఖ రాశారు.

ఆర్‌బీఐ కూడా వీరి లేఖకు సానుకూలముంగా స్పందించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో ఏటీఎంల విస్తరణ చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. కొత్త ఏటీఎంల సంగతి ఏమో కాని.. ఉన్న ఏటీఎంలను మూసేస్తు్న్నారు. అలాగే చాలా చోట్లు ఏటీఎంలు కూడా సరిగా పనిచేయవు. ఇలాంటి నేపథ్యంలో ఏటీఎం ఆపరేట్లు కూడా చేతులెత్తేస్తే పరిస్థితులు మరింత జఠిలంగా మారొచ్చు. ఆర్‌బీఐ ప్రస్తుత రూల్స్ ప్రకారం చూస్తే.. ఇంటర్‌ఛేంజ్ ఫీజు లావాదేవీకి రూ.15గా ఉంది. ఒక కస్టమర్లకు ఐదు లావాదేవీలు ఉచితంగా లభిస్తాయి. ఇకపోతే ఏటీఎం ఆపరేటర్లు చేతులెత్తేస్తే బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు కూడా కొత్తగా ఏర్పాటు చేసే ఏటీఎంపై ప్రతికూల ప్రభావం పడొచ్చు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/