టిడిపి నేత అచ్చెన్నాయుడికి నెగెటివ్‌

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స

acham naidu
acham naidu

అమరావతి: టిడిపి నేత అచ్చెన్నాయుడికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనను త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈఎస్‌ఐ కేసులో అచ్చెన్నాయుడిని ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఈఎస్ఐ స్కాంలో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారినపడిన అచ్చెన్నాయుడిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు రమేశ్ ఆసుపత్రి నుంచి ఎన్నారై ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/