కక్ష సాధింపుల్లో భాగమే చంద్రబాబుకు నోటీసులు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారంలో ఏపీ సీఐడీ అధిచంద్రబాబుకుకారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు వైస్సార్సీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కక్ష సాధింపుల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారని అన్నారు. రాజధాని కోసం రైతుల ఆమోదంతోనే అసైన్డ్ భూములను అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. ఫిర్యాదు చేసిన వైస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్టారెడ్డి ఎస్సీనా? లేక ఎస్టీనా? అని ప్రశ్నించారు. ఆర్కే ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారని మండిపడ్డారు. అట్రాసిటీ చట్టాన్ని వైస్సార్సీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు.

అమరావతిలో అసైన్డ్ రైతులకు కూడా జరీబు రైతులుకు ఇచ్చిన ప్యాకేజీనే ఇచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు. 2015లో ల్యాండ్ పూలింగ్ జరిగితే… ఇప్పుడు సీఐడీ కేసులు పెట్టడం ముమ్మాటికీ కక్ష సాధింపేనని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికీ తన సొంత ప్రయోజనాల కోసం పేద ప్రజల అసైన్డ్ భూములను వాడుకుంటున్నారని ఆరోపించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/