అచ్చెన్నాయుడికి ఈ నెల 15వరకు రిమాండ్‌

సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్టు ఆరోపణలు

అమరావతి: ఏపి టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి జైలు పాలయ్యారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడిని ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అచ్చెన్నను పోలీసులు కోటబొమ్మాళి సెషన్స్ కోర్టులో హాజరు పర్చగా, ఆయనకు న్యాయమూర్తి రెండు వారాల పాటు రిమాండ్ విధించారు. ఈ నెల 15 వరకు అచ్చెన్న రిమాండ్ లో ఉంచాలని తెలిపారు. దాంతో పోలీసులు అచ్చెన్నాయుడిని అంపోలు లోని జిల్లా జైలుకు తరలించారు. అటు, అచ్చెన్నాయుడి అరెస్ట్, ఇటు పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై దాడి ఘటనతో టిడిపి నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ కేసులో అచ్చెన్నాయుడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/