తొలి రోజు నుంచి వైస్సార్సీపీ అరాచకాలకు పాల్పడింది

పెద్దిరెడ్డి దొంగ ఓటర్లను తెప్పించి ఓట్లు వేయించాడు : అచ్చెన్నాయుడు

అమరావతి: కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తొలిరోజు నుంచి కుప్పంలో వైస్సార్సీపీ చేసిన అరాచకాలు అందరికీ తెలుసని అన్నారు. చేతకాని ఎన్నికల సంఘం టీడీపీ ఓటమికి కారణమని విమర్శించారు. పోలీసు వ్యవస్థ వైస్సార్సీపీకి ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో నైతిక గెలుపు టీడీపీదేనని అన్నారు.

ఇదే సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పెద్దిరెడ్డి దొంగ ఓట్ల మంత్రి అని దుయ్యబట్టారు. పక్కనున్న నియోజకవర్గాల నుంచి పెద్దిరెడ్డి దొంగ ఓటర్లను తెప్పించి ఓట్లు వేయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైస్సార్సీపీ ప్రజాదరణను కోల్పోయిందని… ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగితే వైస్సార్సీపీ ఘోరంగా ఓడిపోతుందని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/