అచ్చెన్నాయుడు ఎలాంటి లేఖలు రాయలేదు
బీసీలకు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది

అమరావతి: మందులు, వస్తువులు కొనుగోళ్లకు ఎలాంటి లేఖలు అచ్చెన్నాయుడు రాయలేదని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆధారాలున్నా లీక్ వార్తలతో ఏదో పీకాలని దొంగ పేపర్ చానల్ తాపత్రయపడటంతో తప్పులేదు. ఎందుకంటే 10 రూ. షేర్ 1440 రూ. లకు అమ్ముడుపోయింది. కానీ మిగిలిన వాళ్లు క్విడ్ ప్రోకొ వార్తల ట్రాప్‌లో పడితే ఉన్నా వాల్యూ పడిపోతుందని అన్నారు. ఇప్పుడు బీసీ నాయకుడు అచ్చెన్నాయుడుపై పడ్డారు. బీసీలకు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి బీసీ నిధులు పక్కదారి పట్టించిచారు అని అచ్చెన్నాయుడు గళమెత్తినందుకు వారికి అవినీతి మరక అంటించాలని ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్ విమర్శించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/