రూపాయికే వన్‌ జీబీ డేటా

బెంగళూరులో స్టార్టప్‌ కంపెనీ ప్రయోగం

this-startup-is-offering-free-wifi-using-lasers-in-bengaluru-
this-startup-is-offering-free-wifi-using-lasers-in-bengaluru-

బెంగళూరు: మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు కేవలం రూపాయికే ఒక జీబీ డేటాను అందిస్తామని బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ సంస్థ తెలిపింది. సోమవారం సంస్థ సీఈవో కంరం లక్ష్మణ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. రూపాయికే ఒక జీబీ డేటాను ప్రయోగాత్మకంగా బెంగళూరులో అందజేయబోతున్నామని, ఇక్కడ విజయంతమైతే దేశ వ్యాప్తంగా అందజేస్తామని చెప్పారు. మొబైల్‌ ఫోన్లలో ఓటీపీ ఎంటర్‌ చేయడం ద్వారా వైఫై డబ్బాకు ఎవరైనా కనెక్ట్‌ కావచ్చని చెప్పారు. టీ దుకాణాలు, వ్యాపార కూడళ్లలో లభించే ప్రీ పెయిడ్‌ కూపన్ల ద్వారా కూడా డేటా సేవలను పొందే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/