మయన్మార్‌లో ప్రమాదం..113 మంది దుర్మరణం

గ‌నిలో విరిగిపడిన కొండచరియలు..కార్మికులు మృతి

Myanmar At least 113 die in jade mine landslide

కాచిన్‌: మయన్మార్‌లోని కాచిన్‌ రాష్ట్రంలో ఈరోజు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాచిన్ రాష్ట్రంలోని భారీగా వర్షాలు కురువడంతో కొండచరియలు విరిగిపడి జేడ్ గనుల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 113 మంది మృత్యువాత పడ్డారు. కొండలా పేరుకుపోయిన మైనింగ్ వ్యర్థాలు భారీవర్షం కారణంగా దిగువన ఉన్న సరస్సులో పడ్డాయి. దాంతో సరస్సులోని నీరు ఉప్పొంగి సమీపంలో ఉన్న గనులను ముంచెత్తింది. దాంతో కార్మికులు ఆ బురదనీటిలో ఉక్కిరిబిక్కిరై మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదేళ్ల కిందట కూడా కాచిన్ రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదమే జరగ్గా వంద మందికిపైగా మరణించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/