బుర్కినా ఫాసో దాడి..19 మంది మృతి
At least 10 civilians, 9 gendarmes killed in Burkina Faso attack
బుర్కినా ఫాసో : పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు మిలటరీ ఫోర్స్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది సైనికులు, 10 మంది పౌరులు చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మిలటరీ ఫోర్స్ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ దాడిని కమ్యూనికేషన్స్ మినిస్టర్, ప్రభుత్వ అధికార ప్రతినిధి ఉస్సేని తంబోరా ధృవీకరించారు.
ఈ నెల 14న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 19 మంది సైనికులు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. షాహెల్ రీజియన్‌లోని సౌమ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ మినిస్టర్ మ్యాక్సిం కోనే నేషనల్ రేడియోలో ఈ విషయాన్ని వెల్లడించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/