కరోనా లాక్‌డౌన్‌లో…

జీవన వికాసం -వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడదాం

Happy Family
Happy Family

ఇంట్లోవాళ్లందరు సంతోషంగా తింటారని నాలుగైదు వంటకాలు చేసేయకండి. మీరు చేస్తున్న వృధా పరోక్షంగా ఒక కుటుంబానికి ఒక భోజనాన్ని కోల్పోయేలా చేస్తుంది.

వారానికి కిలో ఉల్లిగడ్డలు వాడుతామనుకుంటే దాన్ని అరకిలోకు పరిమితం చేయాలి.

మీ కట్టడి మరో కుటుంబానికి వారానికి సరిపడా ఉల్లిగడ్డలను అందిస్తుంది. తాజాగా ఉన్నాయి కదాని కూరగాయలను ఎక్కువగా తెచ్చుకోవద్దు.

అవి పాడయిపోతే మరొకరికి లేకుండా చేసిన వాళ్లం అవుతాము. వృధా అయ్యేది మన డబ్బులే. ఆహార పదార్థాల వృధాను సాధ్యమైనంతగా కట్టడి చేయాలి.

ప్రపంచాన్ని అయోమయంలో పడేసిన కరోనా వల్ల ప్రపంచదేశాలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఒకరి నుండి సోకే ఈ వ్యాధిని కొంతైనా కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దాంతో కుటుంబాలకు కుటుంబాలు ఇంటికే పరిమితమయ్యాయి.

ఇంట్లోనే ఉంటూ ఉన్న వాటిని సద్వినియోగం చేసుకుంటూ, ఇంటిల్లిపాదినీ చూసుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తల మీద పడింది. ఇప్పుడు ఇండియాలో బిగ్‌బాస్‌ కరోనా సీజన్‌ నడుస్తోంది. దీని లక్ష్యం ఒక్కటే సమాజహితం, సాధనం ఒక్కటే.. సాంఘిక దూరం.

ఈ ఆటలో అందరూ గెలవాలి. అందుకే కుటుంబాలంతా ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఆఫీసు పని చేసే సౌకర్యం ఉన్న వారికి అయితే పరవాలేదు.

తప్పనిసరిగా బయటికి వెళ్లి పనిచేసే వారి పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. అందుకే పరిమిత వనరులను పరిపూర్ణంగా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పోపులో వేసే జీలకర్ర నుంచి వాషింగ్‌ మెషిన్‌లో వేసే సర్ఫ్‌ వరకు పొదుపుగా వాడాలి. పాలు, పెరుగు, కూరగాయలు వంటి నిత్యావసరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ పదార్థాలను కూడా దుబారా చేయకుండా ప్రతి వస్తువును జాగ్రత్తగా వాడాలి.

పప్పులు, నిండుకోకుండా చూసుకోవాలి. ఆవాలు అయిపోయాయని జీవాలు పోయినట్లు ఇదైపోకుండా, మెంతుల కోసం గెంతులు వేయకుండా ఉన్న వాటిని ఉన్నతంగా వాడుకోవాలి. ఇంట్లో వాళ్ల డిమాండ్లకు లొంగకుండా సమర్ధంగా వ్యవహరించాలి.

నీటి వాడకంలోను పొదుపు పాటించాలి. ఇంట్లోనే ఉన్నాము కదాని చిరుతిళ్లు, వేపుళ్ల సంఖ్య పెంచేయవద్దు. ఫలితం సీజన్‌ పూర్తయ్యే సరికి బరువు పెరిగే ప్రమాదముంది.

ఇంట్లోవాళ్లందరు సంతోషంగా తింటారని నాలుగైదు వంటకాలు చేసేయకండి. మీరు చేస్తున్న వృధా పరోక్షంగా ఒక కుటుంబానికి ఒక భోజనాన్ని కోల్పోయేలా చేస్తుంది.

వారానికి కిలో ఉల్లిగడ్డలు వాడుతామనుకుంటే దాన్ని అరకిలోకు పరిమితం చేయాలి. మీ కట్టడి మరో కుటుంబానికి వారానికి సరిపడా ఉల్లిగడ్డలను అందిస్తుంది.

తాజాగా ఉన్నాయి కదాని కూరగాయలను ఎక్కువగా తెచ్చుకోవద్దు. అవి పాడయిపోతే మరొకరికి లేకుండా చేసిన వాళ్లం అవుతాము.

వృధా అయ్యేది మన డబ్బులే. ఆహార పదార్థాల వృధాను సాధ్యమైనంతగా కట్టడి చేయాలి.

పదార్థాల దుర్వినియోగం ఇప్పుడంతగా తెలియకపోవచ్చు. కానీ, పరిస్థితులు మరింత చేజారితే బయట ఏమీ దొరక్కపోవచ్చు.

ఆ దుస్థితి రాకుండా ఉండాలంటే పరిమితంగా వండాలి. మితంగా తినాలి ఆరోగ్యంగా ఉండాలి.

ప్రస్తుతం కాలం భారంగా నడుస్తున్నా డబ్బులు ఇట్టే అయిపోతున్నాయి. కొన్నిచోట్ల సరుకుల రేట్లు పెంచుతున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా తీరు మారడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. అత్యవసరమైతే తప్ప మార్కెట్‌కు వెళ్లవద్దు. ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోళ్లను వాయిదా వేయడం మంచిది.

తప్పనిసరయితే తప్ప. వాయిదాలు కట్టాల్సినవి ఉంటాయి. ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఎలాగూ బయటికి వెళ్లే పని లేదు కాబట్టి ఎంతో కొంత ఆదా అయినట్లే కదా! పిల్లల డిమాండ్లను ససేమిరా ఒప్పుకోవద్దు.

రానున్న కాలం మరింత కఠినంగా ఉండవచ్చు. అధైర్యపడాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉంటే చాలు. ఇప్పుడున్న లాక్‌డౌన్‌ పెట్రోలు, గ్యాస్‌ వంటి అత్యవసరాలకు పాకితే..

ఇబ్బంది తప్పదు. ఇంధన వినియోగంలోను పొదుపు మంత్రం పాటించాల్సిన అవసరం ఉంది.

గ్యాస్‌ని పరిమితంగా వినియోగించాలి. బయట తిరగొద్దు అంటున్నా పోలీసుల కళులగప్పి ఎక్కడికో వెళ్లాలన్న ప్రయత్నాలు మానుకోవాలి.

మనం వినియోగించుకునే ఇంధనం మరొకరికి అత్యవసరంగా మారవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ స్పృహతో మెలగాలి. ఆఫీస్‌లో ఉన్నప్పుడు వారానికి ఒక్కరోజే సెలవు.

ఇంట్లో ఉన్నట్లే లేదు అని నిట్టూర్చే వారు ఎందరో! ఇప్పుడు ఇరవైనాలుగు గంటలూ ఇంట్లోనే ఉండటం కత్తి మీద సామవుతోంది. మంచికోసమే అయినా కాళ్లు కట్టేసినట్లు కావడంతో విసుగెత్తిపోతున్నారు.

వారానికే టివి మొహమెత్తినట్లయింది. ఫోనంటే చిరాకు పుట్టడం మొదలయింది.

టివి బిగ్‌బాస్‌ షోలో అయితే టివి, ఫోన్‌ కూడా ఉండవు! దాంతో పోల్చుకుంఏ కాస్త మేలే! లాక్‌డౌన్‌ ఎపిసోడ్‌ మొదలైంది

ఇప్పుడే! ఇంకొన్ని వారాలు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఓపికతో మెలగాలి. మానసిక ఒత్తిళ్లకు లొంగకుండా ఉండాలి. కుటుంబంలో వాతావరణం కలుషితం కాకుండా చూసుకోవాలి.

వీటన్నింటికీ కావాల్సింది మనోధైర్యం. ఆ శక్తిని అందరూ పుంజుకోవాలి. ఆసక్తి ఉన్న వాటి మీదికి దృష్టిని మరల్చాలి. అప్పుడే కరోనా సీజన్‌ని విజయవంతంగా పూర్తి చేయగలగుతాం. \

తాజా కెరీర్‌ సమాచారం కోసం :https://www.vaartha.com/specials/career/