తనపై చేస్తోన్న వ్యాఖ్యల పట్ల పోచారం ఆవేదన

హంగర్గ గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన పోచారం శ్రీనివాస్‌రెడ్డి

తనపై చేస్తోన్న వ్యాఖ్యల పట్ల పోచారం ఆవేదన
Assembly Speaker Pocharam Srinivas Reddy

నిజామాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌ జిల్లాలోని కోటగిరి మండలం హంగర్గ గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొందరు తనపై చేస్తోన్న వ్యాఖ్యల పట్ల ఆవేదన చెందుతూ కంటతడి పెట్టారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చాలా కృషి చేస్తున్నానని, అయితే, కొందరు మాత్రం తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. బాన్సువాడకు 5,000 ఇళ్లు మంజూరయ్యాయని ఆయన వివరించారు. అవి పూర్తి చేసేందుకు నిధులు సరిపోకపోవడంతో ఎన్నో కష్టాలు పడి నిర్మాణ పనులను పూర్తి చేయిస్తున్నానని తెలిపారు. తాను ఇంతగా కష్టపడుతుంటే కొందరు మాత్రం తనపై పలు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/