బడ్జెట్‌ సమావేశాలు..అసెంబ్లీకి చేరుకున్న సిఎం కెసిఆర్‌

CM KCR

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో సీఎం కెసిఆర్‌ అసెంబ్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రసంగించనున్నారు. అనంతరం శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన రెండుచోట్ల సభా నిర్వహణ సలహా కమిటీ (బీఏసీ) సమావేశాలు జరుగనున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఎన్ని బిల్లులను సభలో ప్రవేశపెట్టాలి? వంటి విషయాలపై బీఏసీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లోనే సోమవారం (ఈ నెల 6న) 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.