నిబంధనల ప్రకారమే అసెంబ్లీ, మండలి సమావేశాలు

నిబంధనల ప్రకారమే అసెంబ్లీ, మండలి సమావేశాలు
Gutta Sukhendar reddy

హైదరాబాద్‌: కరోనా నిబంధనల ప్రకారమే అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు నిర్వహిస్తున్నామని శాసనమండలి ఛైన్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించేలా అన్ని జాగ్రర్తలు తీసుకుంటున్నామని అన్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. ఈ ఏర్పాట్లను శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరిసింహాచారి పరిశీలిస్తున్నారని, అలాగే తానూ, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కలిసి పరిశీలించిన తర్వాత ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఆటోమేటిక్ టెంపరేచర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని గుత్తా తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారమే సభలు జరుగుతాయని మరొక్కసారి స్పష్టం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/