వికీలీక్స్‌ వ్యవస్థాపకుడికి 50 వారాల జైలు

Julian Assange
Julian Assange

లండన్‌: యునైటెట్‌ కింగ్‌డమ్‌ (యూకే) బెయిల్‌ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను వికీలీక్స్‌ సహ వ్యవస్థాపకుడు, ఆస్ట్రేలియా పౌరుడు జూలియన్‌ ఆసాంజే(47)కు లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు 50 వారాల జైలు శిక్ష విధించింది. అయితే ఆయనకు ఈ జైలుశిక్ష విధిస్తున్నట్లు మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి డెబొరా టేలర్ బుధవారం ప్రకటించారు. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని అసాంజేపై స్వీడన్‌కు చెందిన మహిళ ఆరోపణలు చేయడంతో అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆయన 2012లో ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. గత నెలలో ఈక్వెడార్ రాయబార కార్యాలయం వద్దే అసాంజేను లండన్ పోలీసులు అరెస్ట్‌చేశారు. యూకే బెయిల్ షరతులను ఉల్లంఘించినందుకు ఆయనను వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు దోషిగా నిర్ధారించింది.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/