వరద బాధితులకు బాలీవుడ్ స్టార్ విరాళం

న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. సంపాదనలోనే కాక, సాయం చేయడంలోనూ తాను స్టారే అని నిరూపించుకున్నారు. గతంలో నేపాల్ భూకంపం, చెన్నై, కేరళ వరద బాధితలకు అధిక మొత్తంలో విరాళం ఇచ్చిన అక్షయ్, తాజాగా అస్సాం వరద బాధితులకు రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించారు.
ఇందులో కోటి రూపాయలను అస్సాం సియం సహాయనిధికి, మరో కోటి రూపాయలను కజిరంగ నేషనల్ పార్క్‌కు విరాళంగా అందించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన అక్షయ్ అస్సాంకు సహాయం చేయడానికి ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: