కాంస్యంతో సరిపెట్టుకున్న మేరీ కోమ్‌

ఫైనల్‌కు చేరుకున్న వికాస్‌ కృష్ణన్‌, సిమ్రన్‌ జిత్‌

Mary Kom
Mary Kom

అమన్‌: ఆసియా ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌లో భారత అగ్రశ్రేణి బాక్సర్‌ మేరీ కోమ్‌ సెమీస్‌లో ఓడి నిరాశ పరిచింది. చైనాకు చెందిన చాంగ్‌ యున్‌ చేతిలో 1-4 తేడాతో మేరీ ఓటమిపాలైంది. అయితే ఈ సెమీస్‌లో ఓడినా మేరీని కాంస్యం వరించింది. మరోవైపు భారత బాక్సర్లు కృష్ణన్‌(69కేజీలు), సిమ్రన్‌ జిత్‌ కౌర్‌( 60 కేజీలు) తుది పోరుకు దూసుకెళ్లారు. కాగా ప్రపంచ అగ్రర్యాంకర్‌ అమిత్‌ పంగల్‌(52 కేజీలు), ఆశీష్‌ కుమార్‌(75 కేజీలు), లవ్లీనా( 69 కేజీలు), పూజారాణి(75 కేజీలు) కూడా మేరీలాగే కాంస్యాలతో సరిపెట్టుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/