గెలిచి ఇంటిదారి పట్టిన టీం ఇండియా

ఆసియా కప్ 2022లో టీమ్ ఇండియా జర్నీ ముగిసింది. గురువారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అఫ్గానిస్థాన్‌ ఫై భారీ విజయంతో ఇంటిదారి పట్టింది. టోర్నీ సూపర్-4 దశలో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 101 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భువనేశ్వర్ కుమార్ 5 వికెట్ల బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన .. ఆఫ్ఘనిస్థాన్ ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ సెంచరీ సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది.

అనంతరం, 213 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు మాత్రమే చేసింది. సూపర్-4లో తొలుత పాకిస్థాన్, ఆ తర్వాత శ్రీలంక చేతిలో ఓడిపోయిన భారత్ జట్టుకి ఇదే మొదటి విజయంకాగా.. ఫైనల్‌‌కి చేరుకోలేకపోయింది. అఫ్గానిస్థాన్ టీమ్ కూడా ఈ మ్యాచ్‌తో టోర్నీలో జర్నీని ముగించింది. పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య ఆదివారం రాత్రి దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.