జగన్ ఫై పాజిటివ్ కామెంట్స్ చేసిన నిర్మాత అశ్వనీదత్

కల్కి బ్లాక్ బస్టర్ విజయం తో నిర్మాత అశ్వనీదత్ పేరు మరోసారి మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు చిత్రసీమలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అంటే అశ్వనీదత్ అనే చెప్పేవారు. ఆ తర్వాత సినిమాల బడ్జెట్ పెరిగిపోతుండటం..సరైన కథలు రాకపోవడం తో సినిమాలు నిర్మించడం తగ్గించేశారు. ఇక ఇప్పుడు కల్కి తో భారీ విజయం అందుకున్నారు. ఇదే క్రమంలో అశ్వనీదత్…జగన్ ఫై పాజిటివ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. మొదటి నుండి అశ్వనీదత్ చంద్రబాబు సపోర్ట్ అనే సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో అశ్వినీదత్ టీడీపీ కూటమికి బహిరంగంగానే తన మద్దతు ప్రకటించారు. టీడీపీ 161 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ముందే చెప్పారు. ఎన్నికల ఫలితాలు ఆయన చెప్పినట్టుగానే వచ్చాయి. కాకపోతే ఆయన 161 వస్తాయని అన్నారు..కానీ 164 సీట్లలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది.

ఇటీవల మీడియాతో మాట్లాడిన అశ్వినీదత్ .. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కల్కి లాంటి భారీ బడ్జెట్ మూవీ విడుదల పెట్టుకుని జగన్ మీద ఎలా విమర్శలు చేశారని , అశ్వినీదత్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. జగన్‌పై నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. జగన్‌తో నాకు నేరుగానే పరిచియం ఉందని, ఆయన మా చిన్న కూతురు వివాహానికి కూడా వచ్చారని అశ్వినీదత్ గుర్తు చేసుకున్నారు. కల్కి సినిమా విషయంలో తాను ఎప్పుడు డిఫ్రర్ కాలేదని, నాతో జగన్ ఫ్రెండ్లీగానే ఉండేవారని , నాకు ఆయన వల్ల ఎప్పుడు ఇబ్బంది కలగలేదని వ్యాఖ్యానించారు. మొన్నటి వరకు జగన్ ఫై విమర్శలు చేసిన అశ్వినీదత్ ..ఇప్పుడు సడెన్ గా మాట మార్చడం ఏంటి అని అంత మాట్లాడుకుంటున్నారు.