ఐటి నిఘా నేత్రంలో ఎన్నికల కమిషనర్‌ సతీమణి

ashok lavasa
ashok lavasa


న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసా భార్య నోవల్‌ సింఘాల్‌ లావాసా ఇపుడు ఆదాయపు పన్నుశాఖ నిఘానేత్రంపరిశీలనలో ఉన్నారు. పన్నుల ఎగవేతకు పాల్పడ్డారని ఐటి శాఖ ఆమె దాఖలు చేసిన రిటర్నులను శోధిస్తోందది. ఐటివిభాగం ఇప్పటికే ఆమెకు నోటీసులు జారీచేసి పది కంపెనీల్లో ఆమెకు ఉన్న డైరెక్టర్‌పదవులు, ఆమె దాఖలుచేసిన ఐటి రిటర్నుల వివరాలను కోరింది.ప్రాథమిక విచారణపూర్తి అయిన తర్వా తైటిశాఖ మరిన్ని డాక్యుమెంట్లు అందచేయాలని కోరింది. నోవల్‌సింఘాల్‌ లావాసా దాఖలుచేసిన ఐటిఆర్‌లను ముందు పరిశీలనచేస్తోంది. 2015-17 సంవత్సరాలకు సంబంధించి ఈ పన్ను ఎగవేత ఉన్నట్లు అనామనం వ్యక్తంచేస్తోంది. మాజీ బ్యాంకరు కూడా అయిన సింఘాల్‌ బహుళ సంస్థల్లో ఆమె డైరెక్టర్‌గా కొనసాగడం ఆ కాలంలో అమె పన్ను రిటర్నులపైనే ఎక్కువ దృష్టిపెట్టింది. 2018 జనవరి 23వ తేదీ అశోక్‌ లావాసాను ఎన్నికల సంఘం కమిషనర్‌గా ప్రకటించింది. అంతకుముందు ఆయన కేంద్ర ఆర్ధికశాఖ కార్యదర్శిగా రిటైర్‌ అయ్యారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/