సోనియాగాంధీతో అశోక్‌ గెహ్లాట్‌ భేటి

Ashok Gehlot
Ashok Gehlot

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సమావేశం అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు సోనియాతో గెహ్లాట్ చర్చలు జరిపినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు చెందిన మొత్తం ఐదుగురు ముఖ్యమంత్రులు రెండ్రోజుల క్రితం రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ రాహుల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే వారి డిమాండ్‌ను ఆయన అంగీకరించలేదు. పార్టీ అధ్యక్ష పదవి కోసం కొత్త నేతను చూసుకోవాలంటూ రాహుల్ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే అశోక్ గెహ్లాట్ ఇవాళ సోనియాను కలుసుకోవడం గమనార్హం.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/