ఉద్యోగులు బలపరచిన ఎమ్మెల్సీగా అశోక్‌బాబు ప్రమాణం

ashok babu
ashok babu

అమరావతి: శాసనమండలిలో ఎమ్మెల్సీగా అశోక్‌బాబు ప్రమాణం చేశారు. ఆయన చేత మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కనకమేడల, బుద్ధప్రసాద్‌, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం అశోక్‌బాబు మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. పార్టీ తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు సియం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ సంఘాల నుంచి 60 ఏళ్ల తర్వాత తనకు అవకాశం వచ్చిందని చెప్పారు. మళ్లీ సియంగా చంద్రబాబే వస్తారని ఆయన వ్యాఖ్యానించారు. సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేయాల్సిందేనని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/