హిందువులకు ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదు

నిజామాబాద్ బహిరంగ సభలో అసద్

asaduddin
asaduddin

నిజామాబాద్‌: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నిజామాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎన్ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు మాత్రమే తాము వ్యతిరేకమని, హిందువులకు కాదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ మూడింటికి వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు చేస్తు మోడిపై నిప్పులు చెరిగారు. భారతదేశం అన్ని మతాల సంగమమని, ఈ దేశాన్ని మోడి మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను సెక్యులర్‌గా ఉంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. తన పౌరసత్వాన్ని అడిగే హక్కు మోడి కి లేదని అసద్ పేర్కొన్నారు. తాను హిందువులకు ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/