ఎన్‌ఆర్సీని వ్యతిరేకించండి..

సీఎం కెసిఆర్‌కు అసదుద్దీన్‌ విజ్ఞప్తి

Asaduddin Owaisi
Asaduddin Owaisi

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న ఎన్‌ఆర్సీని వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఎమ్‌ఐఎమ్‌ అధ్యక్షుడు ఎంపీ అసదుద్ధీన్‌ ఒవైసీ కోరారు. ఇదే విషయమై ఈ రోజు యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ ఫోరం బృందంతో కలిసి అసదుద్దీన్‌ ఆయన సోదరుడు అక్బరుద్దీన్‌ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక పై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. అనంతరం అసదుద్దీన్‌ మీడియాతో మాట్లాడారు. ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ రెండూ వేర్వేరని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అంటున్నారు. కానీ ఆ రెండింటికీ తేడా లేదని ఆయన అన్నారు. ఎన్‌ఆర్‌సీకి ఎన్‌పీఆర్‌ తొలి అడుగుగా నిలుస్తుందని చెప్పారు. ఈ అంశంలో రెండు రోజుల్లో టిఆర్‌ఎస్‌ నిర్ణయం చెబుతామని సీఎం చెప్పారన్నారు. రాజకీయ పార్టీలతో సమావేశమవుదామని సీఎం సూచించనట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకంతో ఉన్నామని అసదుద్ధీన్‌ ఒవైసీ అన్నారు. ఇది కేవలం ఒక సామాజికవర్గం సమస్య కాదని రాజ్యాంగం, దేశానికి సంబంధించిన సమస్య అని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/