ధోనీకి వీరాభిమానిని..కానీ తప్పలేదు

భారత మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కె ప్రసాద్‌

M. S. K. Prasad and MS Dhoni
M. S. K. Prasad and MS Dhoni

ముంబయి: తాను టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీకి వీరాభిమానిని అని భారత మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కె ప్రసాద్‌ తెలిపారు. అయితే ధోనీ అంటే అభిమానం ఉన్నప్పటికీ టీమిండియా భవిష్యత్‌ కోసం యువకులకు అవకాశాలిచ్చానని అన్నాడు. రోహిత్‌ శర్మపై నమ్మకంతో అవకాశం ఇచ్చాం. ఆ నమ్మకాన్ని అతడు నిలబెట్టాడు. ఇప్పుడు అతడు ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. అతని ప్రతిభ తెలిసే టెస్టు ఫార్మాట్‌లో కూడా అవకాశాలు ఇచ్చాం అని ఎంఎస్‌కె ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..ఒక ప్యానెల్ సభ్యునిగా ప్రొఫెషనల్ డ్యూటీని పక్కన పెడితే.. ఎంఎస్ ధోనీకి వీరాభిమానిని. ధోనీ కెప్టెన్‌గా రెండు ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. టెస్టుల్లోనూ జట్టును నెం.1 స్థానంలో నిలిపాడు. ఈ ఘనతలపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. రిటైర్మెంట్ గురించి మహీనే నిర్ణయం తీసుకోవాలి. ఒక సెలక్టర్‌గా టీమిండియా భవిష్యత్ గురించి ఆలోచించి యువ క్రికెటర్లకి అవకాశాలు ఇచ్చా’ అని తెలిపాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/